యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు పలువురు భక్తులు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్రకటించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ రామరాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్రకటించారు.
బంగారం విరాళంగా ప్రకటించిన వారు..
సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
మంత్రి మల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి – 2 కిలోలు
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి – 5 కిలోలు
మంత్రి హరీశ్‌రావు – 1 కిలో
దీవకొండ దామోదర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్కర్ రావు – 1 కిలో
జీయర్ పీఠం – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హనుమంతరావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
కడప వ్యాపారవేత్త జయమ్మ – 1 కిలో