Sunday, June 30, 2024

Shamshabad Air Port – రూ.58.80లక్ష‌ల విలువైన గోల్డ్‌ సీజ్‌


శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.58.8 ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. అబుదాబి నుంచి హైదరాబాద్ వ‌స్తున్న ఓ ప్ర‌యాణికుడు వ‌ద్ద ఉన్న‌ 806 గ్రాముల బంగారాన్ని అక్ర‌మంగా తెస్తున్న‌ట్టు గుర్తించారు. బంగారాన్ని పౌడర్‌గా తయారు చేసి దానిని ఉండలుగా మార్చి బ్యాగ్‌ల్లో తీసుకువ‌స్తున్నాడ‌ని, దీని విలువ రూ.58.8 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement