ఇంజనీర్, సోషల్ యాక్టివిస్ట్, లీడర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాను విదేశీ పర్యటనకు పోతున్నట్టు తెలిపారు. ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తో కూడిన ఫొటోను షేర్ చేశారు.
’’నేను అబ్రాడ్ వెళ్తున్నా.. అమెరికా వెళ్లి చాలా రోజులైంది. మళ్లీ మూడు వారాల తర్వాత తిరిగొస్తా.. మీరు, మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండండి.. అట్లాగే రాష్ట్రాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి..‘‘ అని విశ్వేశ్వర్‌రెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.