భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం రాత్రికి 50 అడుగుల దాటిన గోదావరి, గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 50.4 అడుగుల నీటిమట్టంతో సాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతితో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇదిలా ఉండగా కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కన్నా ఎక్కువ నీరు చేరటం.. అవుట్ ఫ్లో కన్నా ఇన్‌ఫ్లో ఎక్కువ ఉండటంతో గోదావరికి వరద పోటు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగారం బ్రిడ్జి వద్ద కిన్నెరసాని ఉరకలు పెడుతోంది. అవసరమైతే తప్పితే రాకపోకలు చేయరాదని.. భారీ వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement