Tuesday, November 26, 2024

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది.  భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది.  శనివారం ఉదయం గోదవారి నీటిమట్టం 43 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలంలో నిన్న 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం…. శనివారం ఉదయానికి 43 అడుగులు దాటింది. పెరిగిన ప్రవాహంతో పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది.  సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. స్నానఘట్టాల ప్రాంతంతో పాటు మెట్లు, విద్యుత్‌ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాసాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement