తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. శనివారం ఉదయం గోదవారి నీటిమట్టం 43 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలంలో నిన్న 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం…. శనివారం ఉదయానికి 43 అడుగులు దాటింది. పెరిగిన ప్రవాహంతో పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. స్నానఘట్టాల ప్రాంతంతో పాటు మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాసాలకు తరలించారు.
గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక
By mahesh kumar
- Tags
- bhadrachalam
- godavari river
- important news
- Important News This Week
- Important News Today
- Irrigation Department officials
- Khammam Jilla News
- khammam latest news
- Khammam Local News
- khammam news
- Khammam News Today Telugu
- Latest Important News
- Most Important News
- Telanagana News
- telangana
- TELANGANA GOVERNMENT
- Telangana heavy rains
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today Khammam News
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement