Friday, November 22, 2024

Godavari water -శ్రీరామ్ సాగ‌ర్ లో కాళేశ్వరం జలాలు – చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్న రైతులు

భీమ్‌గల్ రూరల్, ప్రభ న్యూస్ జూలై 14 -ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కి వస్తున్న కాళేశ్వరం జలాలను ముప్కాల్ పంపు హౌజ్ వద్దకు చూడడానికి బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని భీమ్‌గల్, జాగిర్యాల్, కుప్కల్ గ్రామల రైతులు బస్సులో చూడడానికి వెళ్లారు.ఇటివలే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,ఆర్టీసీ ఛైర్మెన్ బాజీరెడ్డి గోవర్ధన్ లతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముప్కాల్ పంపు హౌజ్ ను ప్రారంభించారు. అప్పటి నుండి ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఎదురెక్కి వస్తున్న కాళేశ్వరం జలాలను తిలకించేందుకు రైతులు అక్కడికి వస్తున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పునరుజ్జీవన పథకం రైతులు ఎంతో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంటు,రైతుబంధు,రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.ఇంకా ఈ రివర్స్ పంపింగ్ తో రైతులం వర్షాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేసిన సిఎం కేసిఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొనపత్రి మానస శ్రీనివాస్, ఎంపీటీసీ చిన్నోల్ల సుమలత రాజేశ్వర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రసాద్,గ్రామ రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement