Friday, November 22, 2024

గోదావరి ఉగ్రరూపం – పరిస్థితిని ఎప్పటికప్పుడు అరా తీస్తున్న మంత్రి పువ్వాడ

ఖమ్మం ఉమ్మడి బ్యూరో : భద్రాచలం వద్ద గోదావరి బుధవారం 7గంటలకు 46.70 అడుగులకు చేరిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక అల ను పోన్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఎగువ నుండి గోదావరికి భారీగా నీరు పోటెత్తడంతో జిల్లా వ్యాప్తంగా ముంపుకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.


పునరావాస ప్రాంతాల్లో నిర్వాసితులకు భోజనం, త్రాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ముంపు ప్రమాదం ఉన్న వారిని తక్షణే గుర్తించి వారందరిని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
వరద ఉదృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని, అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని సూచించారు.
ప్రజలు ఆయా గ్రామాల్ల్లో పొంగిపొర్లుతున్న వాగులు దాటకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట పరచాలని, రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు రవాణా చేయడానికి అవకాశం లేకుండా బారికేడింగ్, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement