Saturday, November 9, 2024

Godavari River: 48అడుగులకు చేరిన నీటిమట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద నీటి మట్టం బాగా పెరిగింది. మంగళవారం సాయంత్రం 48 అడుగులకు చేరుకుంది. ఇది సోమవారం 26 అడుగుల మేరకే ఉండింది. నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు రెండో హెచ్చరిక జారీ చేశారు.

గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు మండలంలోని అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం వద్ద నీటీ వేగం పెరుగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement