Friday, November 22, 2024

Flood – గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి… పూర్తిగా తగ్గే వరకు విశ్రమించొద్దు – పువ్వాడ

ఖమ్మం / భద్రాచలం : గోదావరి వరదల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. గోదావరి వరదల నేపథ్యంలో మంత్రి పువ్వాడ శుక్రవారం భద్రాచలం బ్రిడ్జి పై నుండి వరద ఉదృతి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గోదావరి వరద ముంపు ప్రాంతాల బాధితులను తక్షణమే గుర్తించి ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద ఉదృతిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు వల్ల గోదావరి ఉదృతితో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు రాకపోకలు చేయకుండా నియంత్రణ చేయాలని, లోతట్టు రహదారుల వద్ద బ్యారికెడ్ లు ఎర్పాటు చేసి, ప్రమాద హెచ్చరికలు ఎర్పాటు చేసి వచ్చే రెండు నెలలు ఇదే పరిస్థితిని కొనసాగించాలని కోరారు.


గోదావరి ప్రవాహ ప్రాంతాల్లో ప్రజలు ఎవరు సంచరించకుండా చర్యలు చేపట్టాలని, అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రజలకు తెలపాలని సూచించారు. రాత్రి వేళల్లో బయటకు రావడం ప్రమాదకరమని, ప్రజలు రాత్రి వేళల్లో బయటి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

అత్యవసర సేవలకు తప్పనిసరిగా NDRF బృందాల సేవలను వినియోగించుకోవాలని, జిల్లాలోని పరిశ్రమల ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రస్తుతానికి ఉదృతి తగ్గుముఖం పడుతున్నప్పటికి విశ్రాంతి తీసుకోవద్దని అధికారులు అన్ని సందర్భాల్లో సిద్దంగా ఉండాలని, ప్రస్తుతం అన్ని ప్రాజెక్ట్స్ నిండు కుండలా మారాయని, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదల చేసిన అవి గోదావరిలోకే వచ్చి చేరుతాయి కాబట్టి అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు
ఇక్కడ కూడా ప్రాణ నష్టం, అస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు కృష్ణఆదిత్య, గౌతం పోట్రూ, జిల్లా కలెక్టర్ ప్రియాంక, IG చంద్ర శేఖర్ రెడ్డి లకు మంత్రి పువ్వాడ సూచనలు చేశారు. అదనపు పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ SE కి ఆదేశించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని, పునరావాస కేంద్రాల్లో గత సంవత్సరం చేసిన విధంగా నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయార్థం హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు మొత్తం మూడు హెలిప్యాడ్ లు సిద్దం చేయాలని, అందుకు తగు ఎర్పాటు చేయాలన్నారు.

- Advertisement -


అనంతరం గోదావరి కరకట్ట వద్ద నీటి ఉదృతిని పరిశీలించి మీడియా తో మాట్లాడారు. సమీక్షలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రూ, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పి వినీత్, ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పి పరితోష్ పంకజ్ అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement