భూపాలపల్లి జిల్లా :జులై 26 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవవూర్ మండలం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీకి మంగళవారం సాయంత్రం 5.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు 85 గేట్లలో 75 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే వదులుతున్నారు. ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీలోకి 56,222 క్యూసెక్కుల వరద చేరుతుండగా 40 గేట్లను ఎత్తి 93,361 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద మంగళవారం 11.02 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహించింది.
ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీకి 7.55 లక్షలు, భద్రాద్రి జిల్లాలోని దుమ్ము గూడెం సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు 7.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులు తున్నారు. ఇక భద్రాచలం వద్ద 7.59 లక్షల క్యూసెక్కుల వరద రాగా, గోదావరి నీటిమట్టం 38.9 అడుగులకు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 26,296 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీకి 59 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.
కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.16 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూరి స్థాయి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను 74.22 టీఎంసీల నీరు ఉంది. 8,857 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. దిగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌కు 13,681 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 139 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.36 టీఎంసీల నీరు ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 3,507 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు 72,489 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా 31.66 టీఎంసీలు నీరు ఉంది.
శ్రీశైలం జలాశయానికి 1,236 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.08 టీఎంసీల నీరు ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు 312.04టీఎంసీలు కాగాఅడుగులు(142.2టీఎంసీలు గా ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 5,088 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. జలాశయం స్థాయిని దాటి నీటి నిల్వ 513.45 మీటర్లకు చేరింది…