Friday, November 22, 2024

TS : గోబెల్ మ‌ళ్లీ పుట్టాడు… కెసిఆర్ పై రేవంత్ ఫైర్

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇటీవ‌ల మహబూబ్ నగర్‌ లో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో విద్యుత్ కోత‌లు క‌న్పించాయ‌ని, తాజాగా ఉస్మానియాలో సైతం అదే స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైదంటూ ఎక్స్ ద్వారా వెల్ల‌డించారు.. నీరు, విద్యుత్ కొర‌త‌లో ఉస్మానియాకు నెల రోజులు సెల‌వు ప్ర‌క‌టించార‌ని మాజీ ముఖ్య‌మంత్రి పేర్క‌న్నారు.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

- Advertisement -

‘కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది.. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. ఆ నోటీస్ చూసి కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు కెసిఆర్ దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం ఆయ‌న దిగజారుడుతనానికి పరాకాష్ట.’ అని చురుక‌లంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement