Thursday, September 12, 2024

GO Released – తెలంగాణ‌లో కొత్త పంచాయ‌తీలు…


మున్సిపాల్టీగా ములుగు
రాష్ట్రంలో కొత్త‌గా 223 పంచాయ‌తీల ఏర్పాటు
గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్ర‌భుత్వం
12,991కి చేరిన మొత్తం పంచాయ‌తీల సంఖ్య‌
గ‌త ప్ర‌భుత్వంలోనే ప్ర‌తిపాద‌న‌లు
అప్ప‌ట్లో బిల్లును ఆమోదించ‌న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై
ఆ త‌ర్వాత వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతో ముందుకు
పంచాయ‌తీల పెంపుపై జీవో జారీన రేవంత్ స‌ర్కారు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కొత్త పంచాయ‌తీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లాల అధికారుల‌కు ఆదేశించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తోపాటు కొత్త పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

12,991కు చేరిన పంచాయ‌తీల సంఖ్య‌

కొత్త పంచాయతీల ఏర్పాటుతో తెలంగాణ‌లో పంచాయ‌తీల‌ సంఖ్య 12,991కు చేరింది. ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలు ఉండేవి. కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అలాగే ఒక పంచాయ‌తీని మున్సిపాల్టీగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయ‌తీల సంఖ్య 12,991కు చేరింది.

మున్సిపాలిటీగా ములుగు
ములుగు మేజ‌ర్ గ్రామ‌ పంచాయ‌తీని మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కొత్త పంచాయ‌తీల ఏర్పాటుతోపాటు జిల్లా కేంద్రమైన ములుగును కూడా మున్సిపాల్టీగా ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల్లో వివ‌రాలున్నాయి.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో…

గ‌త ప్ర‌భుత్వ హయాంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోదించాయి. ఆ బిల్లును అప్పటి గవర్నర్‌ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో కొత్త పంచాయతీలపై రేవంత్ స‌ర్కారు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement