హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, బేగంపేట్‌తో పాటు పలు చోట్ల వాన పడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొన్నం కీలక సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు అత్యవరసమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
- Advertisement -