బాసర, నవంబర్ 22 (ఆంధ్ర ప్రభ) : ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు ‘టీమ్ గరుడ’ పేరుతో గో-కార్ట్ డిజైన్ ఛాలెంజ్ కు సిద్ధమవుతున్నారు. (GKDC) సీజన్ 12లో పాల్గొనేందుకు గో-కార్ట్‌ను మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు దీన్ని రూపొందిస్తున్నారు. ఈ పోటీ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గో-కార్ట్ ఈవెంట్ గా గుర్తించబడింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరగబోతుంది.
గత సీజన్‌లో ‘టీమ్ గరుడ’ తయారుచేసిన వాహనం 9వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో టీమ్ మరింత శక్తివంతమైన, కస్టమ్-డిజైన్ చేసిన గో-కార్ట్‌ను రూపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నది. వాహన తయారీ, రవాణా, ఇతర ఖర్చుల కోసం అంచనా వ్యయం 4.5 లక్షల రూపాయలు వెచ్చించారని టీమ్ సభ్యులు తెలిపారు.
ఈ పోటీలో ట్రిపుల్ ఐటీ బాసర విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రఖ్యాత సంస్థలతో పోటీపడబోతున్నారు. టీమ్ గరుడ ప్రతిష్టాత్మక గో-కార్ట్ డిజైన్ ఛాలెంజ్‌లో తమ సత్తాను చాటేందుకు సిద్ధమైంది.