Friday, November 22, 2024

ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లి.. హాస్పిట‌ల్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఏం చేసిందంటే..

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి (Software employee) సూసైడ్ చేసుకుంది. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి వెళ్లిన యువతి మరో నాలుగైదు గంటల్లో ఇంటికి రావాల్సి ఉండగా బలవన్మరణాని (Suicide)కి పాల్పడింది. ఈ మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ నెల 6న అనారోగ్యంతో స్థానిక ప్రైవేటు ఆస్ప‌త్రికి వెళ్లింది. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది.

మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జి కావాల్సి ఉండ‌గా.. ఈ క్రమంలో ఉదయం 9గంటల సమయంలో ఆమె గదిలోకి నర్సు వెళ్లగా లోపలి నుంచి తలుపు గడియపెట్టుకొని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. సుదీప్తి ఫ్యానుకు ఉరేసుకుని వేలాడుతూ (Suicide) కనిపించింది. ఆస్ప‌త్రి నిర్వాహకులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోంది. ఆమె ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement