తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ల్ పంటలు వేయాలని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత దమ్మపేట గ్రామంలో పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలమన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని మంత్రి చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement