Tuesday, November 26, 2024

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాకే వైభ‌వంగా పండుగలు.. మంత్రి త‌ల‌సాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలు, ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీరామనవమి రోజున భద్రాచలంలోని శ్రీ సీతారాములకు అలంకరించనున్న పట్టువస్త్రాలు, శ్రీరామ పట్టాభిషేకం రోజున అలంకరించనున్న పట్టువస్త్రాల తయారీకి ఉపయోగించే 4 రంగుల పట్టుదారాలను మంత్రి చేతులమీదుగా భద్రాచలంకు పంపించారు. సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో పట్టుదారాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టుదారాలను ఆలయ చైర్మన్ జయరాజ్ కు మంత్రి అందజేశారు. భద్రాచలం ఆలయంలో మగ్గాలపై ఈ పట్టు దారాలతో స్వామివార్లను పట్టు వస్త్రాలను తయారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు, చేనేత కళాకారులు వర్కాల సత్యనారాయణ, కరుణాకర్, రాపోలు గణేష్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement