Friday, November 22, 2024

NZB: ఐటి హబ్ ని సందర్శించిన గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు

నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీని స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆహ్వానం మేరకు నిజామాబాద్ జిల్లాలోని ఐటి హబ్ ని గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాలతో హబ్ ని గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు కృష్ణ, సందీప్ రెడ్డి లు పరిశీలించారు. మహేష్ బిగాల గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతిని ధులకు హబ్ లో ఉన్న సదుపాయాలను వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాల్లో గ్లోబల్ లాజిక్ సంస్థ విస్తరించి కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. మన దేశంలో 30,000 మంది ఈ సంస్థలో పనిచేస్తుండగా.. ఒక్క హైదరాబాద్ లో 3000 మంది పని చేస్తున్నారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, టాస్క్ ప్రతినిధులు శ్రీనాధ్ రెడ్డి, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement