మొబైల్ ను ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ లోని న్యూహఫీజ్‌పేటలో ఓ బాలిక 7వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు కొనిచ్చిన సెల్‌ఫోన్‌ను క్లాసులకు కాకుండా గేమ్స్, ఫ్రెండ్స్‌తో చాటింగ్ కోసం ఎక్కువగా వినియోగిస్తోంది. దీంతో తండ్రి ఆమెను మందలించాడు. మనస్తాపానికి గురైన బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. దీంతో చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఇది కూడా చదవండి: TS Assembly: రాష్ట్ర సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారు: సీఎం కేసీఆర్