Friday, November 22, 2024

Gift A Smile – ‘రామన్న’ మాట – ‘రవి’ అన్న బాట – నవ్య పైలెట్ కలకు చేయూత

నిజ‌మాబాద్ – కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం, గర్షకుర్తి గ్రామానికి చెందిన వేల్పుల నవ్య చదువులో అద్భుత ప్రతిభ కనబరుచుతూ పైలెట్ శిక్షణకు ఎన్నికయింది. ఫ్లయింగ్ శిక్షణ కోసం ప్రభుత్వం 36 లక్షల స్కాలర్షిప్ అందజేస్తుండగా, గ్రౌండ్ శిక్షణ కోసం మూడు లక్షలు నవ్య భరించవలసి ఉంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో దాతల సహకారం కోసం ఎదురుచూసింది. సామాజిక మాధ్యమాల్లో నవ్య గురించి వచ్చిన వార్తలను చూసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పందించారు.

రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ, మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా పేదలకు సహాయం చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు నవ్య కుటుంబ సభ్యులను గంగాధర మండలం బూరుగుపల్లి లోని తన నివాసానికి ఆహ్వానించారు. వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి కుటుంబ వివరాలు, పైలెట్ శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శిక్షణ కోసం 50,000 ల రూపాయలను అందజేశారు. దాతలు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నవ్య పైలట్ శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement