బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ . రేపు నిర్వహించుకోబోయే తన పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు .మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలో నడుస్తున్న స్టేట్ హోంలోని అనాథ పిల్లలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
తన 47వ పుట్టిన రోజు సందర్భంగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్‌కై బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు.
ప్రతి రోజు గెలవాలనుకునే ఆ పిల్లల కలలను సాకారం చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు కేటీఆర్. తన బర్త్ డే సందర్భంగా ప్రకటనల కోసం డబ్బులు ఖర్చు చేయకుండా.. ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు
Have been thinking of a meaningful way to contribute to the orphan children of the State home, Yousufguda run by Women & Child Welfare Department
— KTR (@KTRBRS) July 23, 2023
Tomorrow on the occasion of my 47th birthday I pledge to personally support 47 meritorious children from 10th/12th grades and 47…