Saturday, November 23, 2024

వేపచెట్లకు జీహెచ్‌ఎంసీ చికిత్స

దిల్ సుఖ్ నగర్ : నగరంలో వేపచెట్లకు జీహెచ్‌ఎంసీ చికిత్స ప్రారంభించింది. పలు ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ తగిన చర్యలు చేపట్టింది. మీ ఏరియాలో వేప చెట్లు ఎండిపోతున్నాయా..? మాకు సమాచారమివ్వండని అధికారులు కోరుతున్నారు. ఫొమోప్సిస్‌ హజార్డిరాక్‌ అనే క్రిముల వల్ల వచ్చే ఫంగస్‌ డై బ్యాక్‌ వ్యాధి వల్లే చెట్లు ఎండిపోతున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చెట్లను కాపాడేందుకు అవసరమైన మందులను పిచికారి చేస్తున్నారు. ప్రొఫికొనాజోల్‌ ద్రావకం 20 మిల్లీ లీటర్లను 20 లీటర్ల నీటిలో కలిపి ఎండిపోతున్న చెట్టుపై సిబ్బంది స్ర్పే చేస్తున్నారు. కాగా ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లను కాపాడాలని కోరుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన్నీరు రామ్మోహన్‌రావు మానవ హక్కుల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. టీ మస్కిటో బగ్‌ రాత్రి వేళల్లో వేప చెట్లపై చేరి రసం పీల్చడం వల్ల చెట్లు ఎండి పోతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement