Friday, September 20, 2024

GHMC – జంట న‌గ‌రాల‌లో కుంభ‌వృష్టి…

రెండు గంట‌ల పాటు ఏక‌దాటిగా వాన‌
నీట మునిగిన ప‌లు ప్రాంతాలు
చెరువులుగా మారిన ర‌హ‌దారులు
జనజీవనం అస్థ‌వ్య‌స్తం
ఎక్క‌డికక్క‌డ నిలిచిన వాహ‌నాలు
ట్రాఫిక్ జామ్ లో న‌ర‌కంలో ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. నేటి ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ 12 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 2 గంటలపాటు ఏకధాటిగా కురిసిన కుంభవృష్టితో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమాయ్యయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. గంట వ్యవధిలోనే ఈదురు గాలులతో కూడిన జోరు వాన పడింది. మధ్యాహ్నం అనూహ్యంగా మేఘావృతం కావడం.. ఆ వెంటనే భారీ వర్షం కురవడంతో.. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా హైటెక్ సిటీ ఏరియాలో భారీ వర్షం కురిసింది. దీంతో మాధాపూర్, కొండాపూర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్ పల్లి, బాలానగర్, మియాపూర్, దిల్ షుక్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే కీసర, ఇబ్రహీంపట్నం, దండుమైలారం, నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, సింగపూర్‌ టౌన్‌షిప్‌ తదితర ప్రాంతాల్లో వాన దులిపేసింది.

నేడు, రేపు భారీ వర్షాలు

ఇక రేపు ,ఎల్లుండు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement