Home తెలంగాణ‌ GHMC | ర‌హ‌దారుల నిర్మాణానికి భారీగా నిధులు..

GHMC | ర‌హ‌దారుల నిర్మాణానికి భారీగా నిధులు..

0
GHMC | ర‌హ‌దారుల నిర్మాణానికి భారీగా నిధులు..

జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో హెచ్‌-సిటీ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆరు జోన్లలో 5 ప్యాకేజీల్లో చేపట్టే పనులకు రూ.5,942 కోట్ల‌ నిధులు మంజూరయ్యాయి.ఈ మేర‌కు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఇందులో అత్యధికంగా సికింద్రాబాద్ జోన్ లోని ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి రూ.940 కోట్లు విడుదల చేసింది. శేరిలింగంపల్లి జోన్లో ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్‌, విప్రో జంక్షన్‌ల అభివృద్ధికి రూ.837 కోట్లు విడుల‌య్యాయి.

ఇక‌ మియాపూర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు లేన్ల అండర్‌పాస్‌ల‌ నిర్మాణానికి రూ.530 కోట్లు విడుదల చేసింది. ఎల్‌బీనగర్‌ జోన్లో టీకేఆర్‌ కళాశాల జంక్షన్‌ నుంచి మందమాలమ్మ చౌరస్తా వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.416 కోట్లు, ఖైరతాబాద్ జోన్లో జంక్షన్ పరిధిలో రైతిబౌలి నుంచి నానల్‌నగర్‌ వరకు మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.398 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version