Saturday, November 23, 2024

కౌశిక్ రెడ్డికి భారీ జరిమానా..

టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించింది. బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేటలో ఏర్పాటు చేసిన బ్యానర్లకు గాను కౌశిక్‌రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ. 10 లక్షల జరిమానా విధించారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీలో ఆయన చేరికను పురస్కరించుకుని ఆయన అనుచరులు నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే, ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియా ద్వారా పలువురు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వాటిని తొలగించారు. ఇదిలా ఉండగా.. కౌశిక్‌రెడ్డి చేరిక సందర్భంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వందలాది కార్లతో ఆయన ర్యాలీగా రావడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనికితోడు వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ కి మరో డేటా సెంటర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement