Monday, November 25, 2024

డ్ర‌గ్స్ ని పార‌ద్రోలండి-పోలీస్ వ్య‌వ‌స్థ‌కి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ మూల‌స్థంభం-సీఎం కేసీఆర్

పోలీస్ వ్య‌వ‌స్థ‌కి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ మూల‌స్థంభ‌మ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సమాజానికి శ్రేయస్కరమన్నారు.. హైద్రాబాద్ ఇంటిగ్రేటేడ్ Police command control centre ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూపకర్త డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అని సీఎం గుర్తు చేశారు.రెండేళ్ల క్రితమే ఈ కమాండ్ కంట్రోల్ భవనం పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే అనేక కారణాలతో భవన నిర్మాణం ఆలస్యమైందని సీఎం చెప్పారు. ఇందుకు క‌రోనా కూడా కారణమన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చామన్నారు.

రూ. 13 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ తాము రూ. 14 కోట్ల లాభాల్లోకి తీసుకు వచ్చినట్టుగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సైబర్ క్రైమ్స్ ప్రపంచానికి సవాల్ గా మారాయన్నారు. సైబర్ క్రైమ్ కట్టడికి చర్యలు తీసకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాలన్నారు. నేరాలు చేసేవారు రూపాల్ని మారుస్తున్నారన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వం నుండి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు డ్రగ్స్ మహమ్మారిని పారదోలాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పోలీస్ శాఖకు నొక్కి చెప్పారు. తెలంగాణలో ప్రెండ్లీ పోలీస్ ఉందని సీఎం చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మరింత వేగంగా రాష్ట్రంలో పోలీస్ శాఖ స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మాజీ పోలీస్ ఉన్నతాధికారులు చూపించాలని కేసీఆర్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement