Friday, November 22, 2024

లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముక : కేటీఆర్

రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముక‌గా నిలుస్తుంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల పాటు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నున్న 19వ ఎడిష‌న్ బ‌యో ఆసియా స‌ద‌స్సును మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. లైఫ్ సైన్సెస్ – ఆరోగ్య రంగంలో కొవిడ్ స‌వాళ్ల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైద‌రాబాద్ కీల‌కపాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌డానికి గ‌ర్విస్తున్నాను అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధిలో బ‌యో ఆసియా స‌ద‌స్సు క్రియాశీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. బిల్ గేట్స్‌తో జ‌రిగే చ‌ర్చ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో సుమారు 215 సంస్థ‌ల నుంచి రూ. 6,400 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింద‌ని తెలిపారు. ఇప్ప‌టికే ఉన్న‌వాటితో పాటు కొత్త‌గా వ‌చ్చిన సంస్థ‌ల‌తో ఏడాది కాలంలో 34 వేల మందికి ఉపాధి ల‌భించింద‌న్నారు. గ‌తేడాదితో పోలిస్తే 200 శాతం వృద్ధి సాధించిందని కేటీఆర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement