టిఆర్ఎస్ పార్టీ పేరును మార్చే ప్రక్రియను టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. కేసీఆర్ టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ మార్పుపై చర్చిస్తున్నారు. ఈ చర్చ అనంతరం ఒంటిగంట 19 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు.
ఆ తర్వాత ఇతర రాష్ట్రాల పార్టీల విలీన ప్రక్రియ, దేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్న విషయాలను కూలంకశంగా వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ ఆఫీసు కూడా ఏర్పాటు పూర్తి అయ్యింది. రేపటి నుంచి పార్టీ కార్యకలాపాలు ఢిల్లీ నుంచి నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఎనిమిదేండ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ ప్రస్తావించనున్నారు. అదేవిధంగా దేశంలో కూడా ఇదే తరహా కార్యక్రమాలు అమలు కావాలంటే మరో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమన్న కారణంగానే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చే విషయాన్ని కూడా వెల్లడించనున్నారు.