ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఇటీవల అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.
ఇక, గవర్నర్ ఆమోద ముద్ర కూడా లభించడంతో న్యాయ శాఖ గెజిట్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేట్‍లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీలో 17 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ప్రకటించారు.
.