రాజ్యసభ టీఆర్ఎస్ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఆయన ఎన్నిక పత్రాన్ని స్వీకరించారు. రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవ్వాల్టితో (సోమవారం) ముగిసింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జాజుల భాస్కర్, స్వతంత్ర అభ్యర్థి భోరజ్ కొయాల్కర్ నామినేషన్లు సక్రమంగా లేని కారణంగా తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల అధికారి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరూ పోటీ లేకపోవడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు రవి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.