Friday, November 22, 2024

TS : మ‌హిళ పేరుతో క‌నెక్ష‌న్ ఉంటేనే రూ.500 ల‌కు గ్యాస్ ….జీవో విడుద‌ల చేసిన స‌ర్కార్ ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక తాజాగా రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు నేడు లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహిలక్ష్మి గ్యాస్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని వెల్లడించింది.

ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు పథకానికి అర్హులుగా నిర్ణయించింది. మహిళా పేరుపై గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపింది. గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీంకి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనుంది. నెల నెల సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం నేరుగా ట్రాన్స్​ఫార్మర్​ చేయనుంది. కాగా.. 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్​ఫర్​​ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement