శ్రీరాంపూర్, సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్) : శ్రీరాంపూర్ ఏరియాలోని కొత్త రోడ్డు హనుమాన్ నగర్ లో అంబాల శ్రీనివాస్ ఇంట్లో భారత్ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే… కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… సిలిండర్ అయిపోవడంతో కొత్తగా వచ్చిన సిలిండర్ కు రెగ్యులేటర్ పెడుతుండగా గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించి బయటికి పరిగెత్తడంతో ఒక్కసారిగా పేలినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఇంటి పైకప్పు తో పాటుగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.