తెలంగాణ పీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డి పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఇటీవల రావిల్యాలలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభకు సంబంధించిన పాస్‌ల విషయంలో సత్యనారాయణరెడ్డి, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి టి.నిరంజన్.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణికం ఠాగూర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ సంఘం ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న సత్యనారాయణరెడ్డి క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కాకుండా వివరణ పంపారు. దీనిపై సంతృప్తి చెందని క్రమశిక్షణ సంఘం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: జగన్ సర్కార్ కి 13 రోజులే టైంః నారా లోకేశ్ డెడ్ లైన్