Friday, October 18, 2024

TS : గంజాయి గ్యాంగ్ హల్ చల్.. యువకులపై కత్తులతో దాడి

ఇద్దరు యువకులపై గంజాయి గ్యాంగ్ కత్తులతో దాడి చేసిన ఘటన బాలాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మగ్ బుల్, శఫీ అనే ఇద్దరు యువకులు ఫుట్ బాల్ అడి వస్తుండగా రాయల్ కాలనీ వద్ద కొంతమంది యువకులు గాంజా మత్తులో ఉన్నారు. ఇది చూసినా మగ్ బుల్, శఫీ అక్కడి నుంచి నడుచుకుంటూ త్వరగా వెళుతుండడం గమనించిన గంజా గ్యాంగ్ ఇద్దరి యువకుల‌ను చుట్టుముట్టారు. మాటలతో వేధించడం మొదలు పెట్టారు.

- Advertisement -

అయితే వారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించిన మగ్ బుల్, శఫీపై గంజా గ్యాంగ్ కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కత్తులతో ఆ యువకులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరి యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దాడి చేసిన యువకులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిత్యం ఇదే ప్రాంతంలో గంజాయి సేవించి కొంతమంది యువకులు వచ్చిపోయే వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు బాలాపూర్ పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement