Tuesday, November 26, 2024

Warangal : గంజాయి స్మగ్లింగ్.. ఒకరు అరెస్టు.. ఇద్దరు పరారీ

గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. ఈ గంజాయి స్మగ్ల‌ర్ నుండి పోలీసులు 24లక్షల రూపాయల విలులైన‌ 120 కిలోల గంజాయి, ఒక కారు, ఒక సెల్ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ… ములుగు జిల్లా పందికుంట గ్రామానికి చెందిన చెక్క కుమారస్వామి (38), జీవనోపాధికై కారును కొనుగోలు చేసి కిరాయిలకు కారును నడిపించి డబ్బును సంపాదించేవాడు. నిందితుడు కారు ద్వారా వచ్చే అదాయం సరిపోకపోవడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు గత ఎనిమిది సంవత్సరాలుగా ఒడిషా రాష్ట్రంలోని కలిమెల ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి దానిని పెద్ద మొత్తానికి ఇతర రాష్ట్రాల్లో విక్రయించేవాడు. నిందితుడు పలుమార్లు ఒడిషా నుండి హైదరాబాద్ కు కూడా గంజాయిని కారులో తరలించాడు. నిందితుడు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడే సమయంలో పలుమార్లు పోలీసులకు చిక్కడంతో పోలీసులు నిందితుడిని జైలుకు కూడా తరలించడం జరిగింది. నిందితుడు మహారాష్ట్ర పూణేలోని ఎరవడా జైలులో 30నెలల పాటు శిక్షను అనుభవించాడు.

అనంత‌రం జైలు నుండి విడుదలైనా తనలో ఎలాంటి మార్పు రాకపోకపోగా.. తిరిగి మరోమారు గంజాయి స్మగ్లింగ్ కు సిద్ధపడ్డాడు. ఇందుకోసం నిందితుడు ఆదివారం రోజున ప్రస్తుతం పరారీలో వున్న మరో నిందితుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన గణేష్ అలియాస్ గన్ను వద్ద 120 కిలోల గంజాయిని కొనుగొలు చేసి వాటని రెండు కిలోల చొప్పున ప్యాకెట్లలో మార్చి తన కారులో రహస్యంగా భద్రపర్చి మరో నిందితుడు దుప్పటి మోహన్ అలియాస్ చింటూ సహకారంతో గంజాయిని ఏటూరునాగారం, వరంగల్, హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమచారంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆత్మకూరు పోలీసులతో కలసి ఈ ఉదయం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా వస్తున్న కారును పోలీసులు అపి తనిఖీ చేసే క్రమంలో కారు డ్రైవర్ దుప్పటి మోహన్ తప్పించుకపోగా.. ప్రధాన నిందితుడు చెక్క కుమారస్వామి తప్పించుకునే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కారును తనిఖీ చేయగా.. కారులో గంజాయి గుర్తించిన పోలీసులు నిందితుడితో పాటు కారు గంజాయిని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు చెక్క కుమార స్వామిపై గతంలో మహబూబాబాద్ ములుగు జిల్లాలతో పాటు, మహరాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఈ గంజాయి స్మగ్లర్ ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్సు ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ రావు, జనార్ధన్ రెడ్డి, ఎస్.ఐలు శరత్ కుమార్, లవన్ కుమార్, నిస్సార్ పాషా, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు సురేష్, ప్రభాకర్, మహ్మద్ పాషా, శ్యాం, కరుణాకర్, రాజు, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement