Sunday, November 17, 2024

మంత్రి గంగులను మరింత భారీ మెజార్టీ తో గెలిపిస్తాం

కరీంనగర్. – మరోసారి ఆశీర్వదిస్తే… మరింత అభివృద్ది చేసి చూపిస్తాని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గడిచిన 8 సంవత్సరాల్లో కరీంనగరాన్ని గొప్పగా అభివృద్ది చేసి చూపించామన్నారు. . పలు ప్రాంతాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అశోక్ నగర్ 28వ డివిజన్ లో… వాసవి లైన్-1, లైన్-2 లకు చెందిన స్థానికులతో సమావేశాన్ని నిర్వహించారు. వాసవి హైట్స్ లో నిర్వహించిన ఈ సమావేశానికి… మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ హాజరై… వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే డివిజన్ లో చాలావరకు సమస్యలను పరిష్కరించామని… మిగిలిపోయిన చిన్న చిన్నసమస్యలను సైతం త్వరలోనే పరిష్కారిస్తామని హామి ఇచ్చారు.

అయితే… కరీంనగర్ అభివృద్ధి ప్రదాత… మంత్రి గంగుల కమలాకర్ అని… మరోసారి మంత్రి గంగుల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సిఎం కెసిఆర్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో… గంగులకే మా ఓటు వేసి గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తీర్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు నక్క కృష్ణ వంగల పవన్ కుమార్, మరియు వాసవి వీధి ఒకటవ డివిజన్ అధ్యక్షులు ఎన్. శ్రీనివాస్, రెండవ వీధి అధ్యక్షులు మల్లేశము రతన్, కృష్ణ, హరీష్, ప్రసాద్, నాగభూషణం, నాగరాజు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.

గంగుల గెలుపు నల్లేరు పై నడకే….

- Advertisement -

కరీంనగర్ ఏఎంసి చైర్మెన్… గ్రానైట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డవేణ మధు. మంత్రి గంగుల గెలుపు నల్లేరు పై నడకేనని సర్వేలు చెబుతున్నాయని… భారీ మెజార్టీ పై కన్నేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన గెలిచేది మంత్రి గంగుల కమలాకరేనన్నారు. కరీంనగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిగా… అభ్యర్థిత్వం ఖారారు కావడంతో… గ్రానైట్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డవేణ మధు ఆధ్వర్యంలో… అసోసియేషన్ సభ్యులు మంత్రి గంగులను మర్యాదపూర్వకంగా కలిశారు. వెండి లారీని బహుకరించి… తమ మద్దతు ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… మిమ్మల్ని గెలిపించుకుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి… శివ… ముత్తు… రాంగోపాల్… సతీష్… రమేష్…. తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement