Friday, November 22, 2024

దేశమంతా ఒకే పంట సేకరణా విధానం ఉండాలి: గంగుల

దేశమంతా ఒకే పంట సేకరణా విధానం ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన, అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లోని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవల్ని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూలే జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు పూలే పేరున బీసీ గురుకులాలు, విదేశీ విధ్యానిది పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల యాసంగి వడ్లను కొనాలని ఢిల్లీలో చేస్తున్న మహాదీక్ష ప్రాంగణానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేరుకున్నారు. ఆయనతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ రాజ్యాంగ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవద్దని రైతులు పండించిన పంటను వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతతో చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్  రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చరని రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచితకరెంట్, సాగునీరు అందించి రైతుల బాగుకోసం క్రుషిచేస్తున్నారని ఇలాంటి సమయంలో రైతుల పంటలను సేకరించకుండా కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని, దేశమంతా ఒకే పంట సేకరణా విధానం ఉండాలన్నారు.

 రైతులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాదీక్ష దేశ చరిత్రలోనే విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర రైతాంగం కోసం స్వయంగా ముఖ్యమంత్రి దేశ రాజదానిలో దీక్ష చేపట్టడం, ఈ దీక్షకు జాతీయ రైతు సంఘాలు, రాకేష్ టికాయత్ లాంటి నేతలు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పున:సమీక్షించి తెలంగాణ రైతులు పండించిన పంట సేకరణకు ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement