Saturday, November 23, 2024

మరోసారి ఆశీర్వదించండి.. మరింత గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తా – మంత్రి గంగుల

కరీంనగర్ – ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా… అభివృద్ది చేస్తున్నానమని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా అభివృద్ది చేసి చూపిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో బుదవారం పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొదట చింతకుంట రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల… అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడసంఘం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు… సిసి రోడ్డు నిర్మాణానికి మరో 5 లక్షలు… మొత్తం 15 లక్షల రూపాయలు కెటాయించారు. గౌడన్నల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం… సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి గంగుల. గౌడన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.
అక్కడి నుండి శాంతి నగర్ కు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ కు… స్థానిక ఎంపిటిసి భూక్యా తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో… బంజార మహిళలు ఘన స్వాగతం పలికారు. వారితో డప్పుచఫ్ఫుళ్ల మధ్య సంత్ సేవాలాల్ ఆలయం వద్దకు చేరుకుని 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సంత్ సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అక్కడి నుండి సంత్ సేవాలాల్ ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల… మేరిమా యాడి పతాకావిష్కరణ చేసి… భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మేరి మా యాడి ని దర్శించుకుని… ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం… సంత్ సేవా లాల్ ను దర్శించుకున్నారు. సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ధి కోసం గతంలోనే 5 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు మంత్రి గంగుల. బంజారా బిడ్డలకు దైవభక్తి ఎక్కువని… మేరీ మా యాడి కృపా కటాక్షాలతో సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అన్ని మతాలను గౌరవించుకుందామన్న మంత్రి గంగుల… సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ది కోసం సహాయసహకారాలు అందిస్తానని హామి ఇచ్చారు. పెళ్లి కానీ యువతులకు త్వరగా పెళ్లి కావాలని జరుపుకునేదే తీజ్ పండుగ అని… బంజార బిడ్డలకు తీజ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య పాలనలో శాంతినగర్ మురికికూపంగా ఉండి… అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిందని… కానీ… స్వయంపాలనలో శాంతినగర్ అభివృద్ధి చెంది దాదాపుగా కరీంనగర్లో కలిసిపోయిందన్నారు. ఎమ్మెల్యేగా… మంత్రిగా శాంతినగర్ అభివృద్ధి కోసం కృషి చేశానన్న మంత్రి గంగుల… మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు.


అనంతరం చింతకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చేరుకున్న మంత్రి గంగుల… మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు 31. 80 లక్షలతో చేపట్టిన కాంపౌండ్ వాల్, టాయిలెట్లు… ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం… 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు

. ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి శ్రీలత మహేష్, జడ్పీటిసి పిట్టల కరుణ- రవిందర్… ఏఎంసి చైర్మెన్ రెడ్డవేన మధు, ఎంపిటిసి భూక్యా తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement