హైదరాబాద్ కరీంనగర్ – తెలంగాణ స్వయం పాలనలో మరో మహోజ్వల ఘట్టం నేడు ప్రారంభమైంది, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో, అత్యుత్తమ పాలనా సౌదం డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై తెలంగాణకు అంకితమైన శుభసందర్భంలో రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ మహత్తర ఘట్టంలో పాలుపంచుకొనే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అంతకు ముందు మధ్నాహ్నం రెండు గంటల సమయంలో నూతన సచివాలయం 4వ అంతస్థులోని డి-వింగ్ లోని తన చాంభర్లో వేద మంత్రోచ్ఛరణల మద్య కుటుంభ సభ్యుల సమక్షంలో ఆశీనులయ్యారు. నూతన సచివాలయంలోని తన ఛాంబర్ కు పూజా కార్యక్రమాల అనంతరం తొలి సంతకం చేసిన ఫైళ్లను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కి, పౌరసరఫరాల శాఖ వి. అనిల్ కుమార్ కి అందించారు.తొలి సంతకం ఐసీడీఎస్ అంగన్వాడీలకు పోషకాల సన్నబియ్యం పంపిణీ చేసే బిల్లుపై చేశారు.
రాష్ట్రంలోని 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లోని 15లక్షలకు పైగా పిల్లలకు, మాతా శిశుసంరక్షణలో బాగంగా లక్షలాది బాలింతలు, గర్బిణులకు పోషకాహారాన్ని అందించే గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతీనెల కోటి యాబైఎనిమిదిలక్షల విలువ చేసే 2162 మెట్రిక్ టన్నుల సన్నభియ్యం ఐసీడీఎస్ కింద అంగన్వాడీలకు అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. అణగారిన వర్గాల జీవితాల్లో మహనీయుడు బాబాసాహెబ్ పెనుమార్పులు తెచ్చాడని ఆయన పేరుతో వెలిసిన పరిపాలనా సౌదం నుండి బీసీ మంత్రిత్వ శాఖలో తొలి ఫైలుగా బీసీ కార్పోరేషన్, ఎంబీసీ కార్పోరేషన్ ఆక్షన్ ప్లాన్ పై రూపొందించిన ఫైలుపై తొలిసంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. బీసీ ఎంబీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారి కలలు సాకారమయ్యే విదంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా నిలిచారని, బీసీ కార్పోరేషన్ ద్వారా 50వేల నుండి 12 లక్షల వరకూ 60 నుండి 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు 303 కోట్లు, ఎంబీసీ కార్పోరేషన్ ద్వారా మరో 300 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన వర్గాల స్వావలంబన కోసం ఖర్చు చేసే యాక్షన్ ప్లాన్ని ఆమోదించడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, సావిత్రీ బాయి పూలే అబ్యుదయ యోజన వంటి స్కీమ్ ల కింద ఐఎస్బీ, కాటగిరి 1 నుండి 3 వరకూ వేలాది బీసీ కుటుంభాలకు రుణాలు అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.