ఫిరాయింపులకు మేం వ్యతిరేకం
కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చట్ట సవరణ
జగిత్యాల, ఆంధ్రప్రభ : పోలీసుల నిర్లక్ష్యం వల్లే కాంగ్రెస్ సీనియర్ నేత గంగారెడ్డి హత్య జరిగిందని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ మృతుడు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందన్నారు. రాష్ట్ర డీజీపీతో పాటు ముఖ్యమంత్రిని కలిసి గంగారెడ్డి హత్యలు పోలీసుల నిర్లక్ష్యాన్ని వివరిస్తామన్నారు.
పార్టీ ఫిరాయింపులకు మేం వ్యతిరేకమని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ… పోలీసుల నిర్లక్ష్యం వల్ల మిత్రున్ని కోల్పోయానన్నారు. తన ఆవేదనను లేఖ ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశానన్నారు.