మేడ్చల్ జులై 23 (ప్రభన్యూస్):బారి వర్షాలు కురిసి మేడ్చల్ పెద్ద చెరువు నిండి అలుగు పారుతున్న సందర్బంగా మునిసిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు డప్పు చప్పులు,డిజే పాటలతో మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని బొడ్రాయి దేవతల నుండి మేడ్చల్ పెద్ద చెరువు వరకు నిర్వహించిన (చాట) ఊరేగింపులో అన్ని కుల సంఘాల పెద్దలు,వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు,పట్టణ ప్రజలతో అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం చెరువు వద్ద పూజలు నిర్వహించి మేక పిల్లను వదలడం జరిగింది.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పట్టణ పట్టణ ప్రజలను సుభిక్షంగా చూడాలని కట్టమైసమ్మ తల్లిని ఆకాంక్షించినట్లు తెలిపారు.మేడ్చల్ పెద్ద చెరువు దగ్గర పరుగులు పెడుతున్న అలుగులు వీక్షించడానికి వచ్చే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను తల్లి తండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని దీపిక సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లో మొక్కలు నాటి పెంచడం మూలంగానే రాష్ట్రంలో అత్యధిక వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండుకుండలా మెరుస్తున్నాయని ఆమే సంతోషం వ్యక్తం చేశారు.భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువుతోపాటు తుమ్మ చెరువు నిండి సాగు చేసే రైతులకు,త్రాగునీటి కోసం మేడ్చల్ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంగమ్మ తల్లి కరుణించిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కిష్టయ్య పంతులు,మున్సిపల్ కౌన్సిలర్ లు పెంజర్ల నరసింహ స్వామి యాదవ్,సముద్రం సాయి కుమార్.బత్తుల శివ కుమార్ యాదవ్.మర్రి శ్రీనివాస్ రెడ్డి.మున్సిపల్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చెరువుకొమ్ము శేఖర్ గౌడ్.మేడ్చల్ మాజి ఉపసర్పంచ్ మర్రి నర్సింహా రెడ్డి.సందీప్ గౌడ్,మధుకర్ యాదవ్.రాఘవేందర్ గౌడ్.నడికొప్పు నాగరాజు ముదిరాజ్.సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.. ..