Tuesday, November 19, 2024

Ganesh MahaRaj – గల్లీ కా గణేశ్ ఆగయా! అంబరాన్నంటేలా సంబురాలు

గ‌ణేశ్ ఆగ‌మ‌న్ పేరుతో కార్య‌క్ర‌మాలు
ఆట‌పాట‌ల‌తో ఊగిపోతున్న యువ‌త‌
కాల‌నీలు, బ‌స్తీల్లో ప‌టాకుల మోత‌
ఘ‌నంగా స్వాగ‌త ఏర్పాట్లు
హైద‌రాబాద్ సిటీలో ఆధ్యాత్మిక శోభ‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:

హైదరాబాద్​లో వినాయక చవితి సంబురాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తులు రెట్టింపు ఉత్సాహంతో విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి వేడుకగా వినాయకుని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మండపానికి కొంత దూరంలో భారీ వేదికను ఏర్పాటు చేసి ‘గణేశ్‌ ఆగమన్‌’ పేరుతో యువత భారీ స్వాగతోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే గణేశ్‌ ఆగమన్‌ ఉత్సవాలు ఈ సారి మరింత ఎక్కువగా కనిపించాయి. స్వాగత ఏర్పాట్లు కూడా అంబరాన్నంటాయి.

- Advertisement -

వేదికలతో స్వాగతం
హైద‌రాబాద్ సిటీలో ఈసారి లక్ష గణేశ మండపాలు వీధుల్లో కొలువుదీరుతాయని అంచనా ఉంది. ఐదు అడుగులకు మించి ఎత్తుండే విగ్రహాలు 40వేలకుపైగా ఉంటాయని సమాచారం. వాటిని మండపాలకు తీసుకెళ్లేందుకు స్థానిక నేతలు, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఇతర ప్రముఖులు ‘గణేశ్‌ ఆగమన్‌’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రాంనగర్‌ కూడలిలో భారీ స్టేజితో నిర్వహించిన స్వాగత వేడుకే అందుకు నిదర్శనం. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, ప‌టాకుల మోత‌ మధ్య యువత గణేశునికి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అంబర్‌పేట, గౌలిగూడ, నాంపల్లి, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఉత్సవాలు జరిగాయి.

చెరువుల వద్ద సందడి
నగరంలోని దాదాపు 50 చెరువుల వద్ద గణేశ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని, మరిన్ని తాత్కాలిక కోనేరులను సిద్ధం చేస్తున్నట్లు బల్దియా పారిశుద్ధ్య విభాగం అధికారులు తెలిపారు.

నగరంలో ఆధ్యాత్మిక శోభ
మరోవైపు వినాయక చవితి ఉత్సవాల ప్రారంభం కానున్న నేపథ్యంలో భాగ్యనగరంలో అధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రతి వీధిలో వినాయక మండపాలు వెలుస్తున్నాయి. ప్లాస్టర్​ ఆఫ్ పారిస్​తో చేసిన విగ్రహాలు వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందని అందువల్ల ప్రతి ఒక్కరు మట్టితో చేసిన విగ్రహాలనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్​లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement