Saturday, November 23, 2024

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: గండ్ర దంపతులు

ఉచిత శిక్షణ శిబిరాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జిఎంఆర్ఎమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఇవ్వనున్న ఉచిత శిక్షణ తరగతులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గండ్ర దంపతులు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 80039 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నిరుద్యోగులు బాగా కష్టపడాలని తెలిపారు. ఉద్యోగ జాతర నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా శిక్షణ తరగతులు ఇవ్వనున్నామని తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న యువతకు ఫిజికల్ టెస్ట్ కి కావాల్సిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని యువతీ, యువకులు తమ లక్ష్యాలను చేరుకొని,భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement