Wednesday, October 2, 2024

TG: గాంధీ ఆదర్శాలను భావితరాలకు అందించాలి… కలెక్టర్ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ… మహాత్మా గాంధీ జీవనం గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నామన్నారు. నేటి సమాజంలో మనందరం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని, గాంధీ జీవితంలో ఎప్పుడూ షార్ట్ కట్స్ వెతుక్కోలేదని, న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయాలు సాధించారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ మొదలగు ఉద్యమాలు ఒక్కరోజులో వచ్చినవి కావని, గాంధీ మహనీయులు ప్రతి రోజూ నమ్మిన సిద్ధాంతం ప్రకారం నిరంతరాయంగా చేసిన కృషి ఫలితంగా ఉద్యమాలు సఫలీకృతం అయ్యాయని, ఒక్కరోజులో ఫలితం రాలేదన్నారు.

అనంతరం మహాత్మ గాంధీ స్మారక నిధి వారు రూపొందించిన మహాత్మ గాంధీ సూక్తుల పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, డి.ఎం అండ్ హెచ్.ఓ. డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సి. సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement