Thursday, January 9, 2025

Game Changer – దిల్ రాజు సాధించారు – అదనపు షో లకు, ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచి, ఎక్స్ ట్రా షోలకు అనుమతులు ఇచ్చారు.

తెలంగాణలో ఇటీవల సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని అన్నారు

అయితే నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీ సీ చై.ర్మన్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల కోసం సీఎంని కలిశారు. దీంతో టికెట్ రేట్లు పెంచుతూ పర్మిషన్ ఇచ్చారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో అడగ్గా దాన్ని మాత్రం రిజెక్ట్ చేసారు.

- Advertisement -

జనవరి 10న మొదటి రోజు ఉదయం 4 నుంచి ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు. మొదటి రోజు మల్టీప్లెక్స్ లలో 150, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇస్తూ మల్టీప్లెక్స్ లలో 100, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

దీంతో గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణలో కూడా పది రోజుల పాటు టికెట్ రేట్లు పెరిగాయి. ఈ ఎఫెక్ట్ తో కలెక్షన్స్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది.

డాకు మహారాజ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అవసర్లేదని నిర్మాత నాగవంశీ అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు టికెట్ రేట్ల పెంపు అడగలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement