Home తెలంగాణ‌ Gajwel – గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

Gajwel – గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

0

గజ్వేల్, ( ఆంధ్రప్రభ) గజ్వేల్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పరంధాములు గౌడ్ రాయపోల్ పిఎస్, వెంకటేష్ దౌల్తాబాద్ పిఎస్ లో పనిచేస్తున్నారు. .

సమాచారం అందుకున్న గజ్వేల్ పట్టణ ఇన్స్పెక్టర్ బి. సైదా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version