గద్వాల (ప్రతినిధి), జులై 4 (ప్రభ న్యూస్) : గద్వాల పట్టణంలోని కొట్టం జూనియర్ కళాశాల సమీపంలో (కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఇంటికి సమీపంలో) ప్రసాద్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొవద్దని ఆయన నిరసన వ్యక్తం చేశాడు.
టవర్ పై నుంచి కిందకు దిగాలంటూ కాంగ్రెస్ నాయకులు కోరినప్పటికీ ససమేరా అంటూ సెల్ టవర్ పైనే ఉన్నాడు. సంఘటన స్థలం వద్దకు కాంగ్రెస్ నాయకులతో పాటు పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలం వద్దకు వచ్చిన డీఎస్పీతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.
- Advertisement -