జోగులాంబ గద్వాల (ప్రతినిధి) – (ప్రభ న్యూస్) .. గద్వాల నియోజకవర్గం, ప్రస్తుత ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ నేడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. దీనిలో నది అగ్రహారం, వెంకంపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లొ ఎమ్మెల్యే దంపతులు, ఎమ్మెల్యే తనయుడు సాకేత్ లు హోమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు..అంతకు ముందు అక్కడి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకొని పవిత్రమైన కృష్ణానది ఒడ్డున నది అగ్రహారం నుండి ఇంటింటికి ఆత్మీయంగా మాట పలకరింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గద్వాల మండలం నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడం జరిగిందని గద్వాల మండలం రాజకీయ జీవితానికి ఎల్లప్పుడూ అండగా నిలిచి నన్ను ఆశీర్వదించడం జరిగింది అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే వార్డు ప్రజలకు తెలిపారు. నది అగ్రహారం, వెంకంపేట వార్డ్ అభివృద్ధి కొరకు కోటి రూపాయలు నిధులను మున్సిపాలిటీ ద్వారా మంజూరు చేయడం జరిగినదని, అదేవిధంగా బీసీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గద్వాల నియోజకవర్గ ప్రజలందరూ మరొక్కసారి సీఎం కేసీఆర్ ని నన్ను ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపిలు ప్రతాప్ గౌడ్, విజయ్, జడ్పిటీసీ రాజశేఖర్ గద్వాల నియోజకవర్గం అన్ని మండలాల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.