Friday, September 6, 2024

Gadwal – రైతు రుణ‌మాఫీ – రేవంత్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం ..

గద్వాల (ప్రతినిధి) (ప్రభ న్యూస్) – జోగులాంబ గద్వాల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా సంతోషం వ్యక్త పరుస్తూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైతులతో కలిసి బుధవారం రోజు ధరూర్ మండలం, చింతరేవుల గ్రామ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో సందర్భంగా ప్రజలకు రైతులకు చెప్పడం జరిగిందన్నారు. అందులో భాగంగా గురువారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది అని తెలిపారు. మొదటి విడతగా రైతులకు లక్షలోపు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -

ఆగస్టు 15 నాటికి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించే సందర్భంగా గ్రామ గ్రామాలలోని రైతులు సంతోషాలతో సంబరాలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షరుణమాఫీ చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున గద్వాల రైతాంగం తరపున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రామిరెడ్డి రెడ్డి, ప్రభాకర్ గౌడ్, అజయ్, డి.ఆర్ విజయ్, శివారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, డి.వై రామన్న ,విజయ భాస్కర్ రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న, మహబూబ్, ఈశ్వర్, హనుమంత్ రెడ్డి, కొత్త గణేష్, శ్రీనివాస్ రెడ్డి, పూడూరు చిన్నయ్య , నరేష్ గౌడ్, కృష్ణ , పవన్ రెడ్డి, రైతులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement